మెల్ల మెల్ల మెల్లగా.........అణువణువు నీదెగా !
ఆమె :- మెల్లమెల్ల మెల్లగా .......అణువణువునీదేగా !
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా .............!
''మెల్ల మెల్ల మెల్లగా ....ఆణువణువూ నీదేగా ''
సుతారమైన మునివేళ్ళ స్పర్శకు ....మేను సితారలా సవరించబడుతుంటే శరీరం పాడే వలపు సరాగాలను ఏ ఇంతి అయినా ఇష్ట పడుతుంది . మొరటోడు లా ' కబాడ్డీ ' ఆడేస్తా......' t - 20 ' లో లా 'వీర బాదుడు బాదేస్తా ' ఆంటే సుతారమూ ఇష్ట పడడు . తపించే ప్రతి అణువు నీదే...... అని సాధికారంగా పిలుస్తుందీ ఆంటే ....................... ఆ 'సాధికారత' నిండు మనసుతో ....పూర్ణ విశ్వాసం తొ ....తను చేపట్ట బోయే ....వాడి ముందే ఆవిష్కరించబడుతుంది .. ......అందరి ముందు కాదు ! అందుకే.....మెల్ల మెల్ల మెల్ల గా అంటుంది.
ఎంత మెల్లగా ఐతే మాత్రం ' మెల్ల మెల్ల మెల్లగా ' అనుకుంటూ.....పల్లవి నే సాగదీస్తూ .....ఇంత మంద గమనం సాగిస్తే ......ఎప్పటికి అయ్యేను ' అంటున్నారు కదూ ! ఏమి చేయ మంటారు చెప్పండి ?నా కంటే ముందు .....నా పెన్ను ....నా చేతి వేళ్ళు....కీ బోర్డు బటనులు...అన్నీ అణువణువునా ఆ ప్రేమ భావాన్ని వంట బట్టించుకుని ....మొద్దుబారి ......సుతారమూ కదలనని మొరాయిస్తున్నాయి !అందుకే ......ఇంత ఆలశ్యం.....క్షమించండి !
యెంత సాధికారపు హక్కు లేకపోతె .....యెంత సాన్నిహిత్యపు పెంపు లేకపోతె ....అంతలా ఆహ్వానం పలికేలా చెపుతుంది........'' మెత్తగ అడిగితే లేదనేది లేదుగా '' అని. మొదట్లో నేను ' మెత్తగ అడిగితే కాదనేది లేదుగా ' అనుకున్నాను . సరిగా వినలేదేమో అనుకుని మళ్లీ విన్నా .....ఆప్పుడర్ధమయ్యింది ' లేదనేది లేదుగా' అనే వాక్యమే సరి ఐనదని . వాటిలో ఉన్న తేడా అనంతమైనదని ........నిఘూడమైనదని !
కాదనేది లేదుగా ఆంటే.........నేనేమీ 'నో ' అనడం లేదుగా ....అడ్డు చెప్పడం లేదుగా ....అనే అర్ధం వస్తుంది.
కానీ ' లేదనేది లేదుగా ' ఆంటే మాత్రం చాలా లోతైన అర్ధం వస్తుంది ! ఒకటి.............నేను ' లేదు '- ' కాదు ' అనే ప్రశ్నే లేదని ! రెండు .........' నా దగ్గర ఇది లేదు అనే వీలు నీకు లేనే లేదు '........' నేకేమి కావాలో అవన్నీ నా దగ్గర వున్నాయి ' అని అన్యాపదేశంగా ...ధీమాగా... చెప్పడం ఆమె ఉద్దేశం !
ఇదేదో టీనేజ్ లో వుందే పరస్పర ఆకర్షణ తాలూకు అపరిపక్వ మొహా వేశపు పాట కానే కాదు . ఆణువణువూ దగ్గర అయ్యేంత చనువు వున్నదీ ఆంటే .........అది నిండైన ప్రేమ....లోతైన ప్రేమ . ఒకరి మీద ఒకరికి సంపూర్ణ విశ్వాసం ...నమ్మకం ఉంటేనే ఆ స్థిరత్వం వుంటుంది ఆమె పలికే తీరులో.......ఆహ్వానించే రీతిలో !
ఆమె :- నీదికానిదేది లేదు నాలో ....నిజానికీ నీనున్నది నీలో
ఆహా.........ఎంత సరళ మైన భాషలో రాసాడో.........అంత లోతైన భావన లోకి దింపుతాడు ' కవి ' మనల్ని!
అతనికి సంభందించని ......అతనికి చెందని ..... అతని సొంతం కాని ... ....అతనికి హక్కు లేని ...ఏ విషయము , ఏ సంగతి లేనే లేదట ఆమెలో ( భౌతికంగా కానీ....మానసికంగా కానీ ) ! అతనిలో నిక్షిప్తమై ....'' తనే నేను - నేనే తను '' అన్నట్లుగా వుందట. అసలు ఆమె ఉనికే ఆమెకు ప్రశ్నార్ధకంగా ఉన్నప్పుడు ....పాపం ఆమె మాత్రం ఏమి చేయ గలుగుతుంది .
ఆమె ' అచేతన ' అవస్థను గుర్తించినట్టున్నాడు. అందుకే ఇలా అంటున్నాడు !
అతడు :- ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ....ఆ ఒక్కటీ చిక్కెనీ గుప్పిటిలో ......
అవునూ మరీ ...... '.birds of same feather ' అంటారు చూసారూ ....అలా ఇద్దరిలో అల్లా ఫీలయ్యే మనసుంది కాబట్టే ఇదంతా సాధ్యమయింది . అందుకే ఆ మనసు ఎవరి గుప్పిటిలో చిక్కినా ...ఫలితం ఒకటేగా ! అందుకే అతనలా అనగానే పారవశ్యం తొ కూడిన ఒప్పుకోలుతో ''హా''అంటుంది .
అతడు :- నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మని నిలచినాను .
ఆమె : - దోచుకుందమనే నేను చూచినాను
చూచి చూచి నీవె నన్ను దోచినావు !
ఈ రెండవ చరణమే నాకు కాస్త తికమకగా అనిపించింది .........ఆమె అనాల్సిన మాటలు అతను .....అతను అనాల్సిన మాటలు ఆమె .....అన్నాడేమో అనిపిస్తుంది . కావలిస్తే మీరు కూడా ఒక్కమారు పరికించండి. దోచు కొమ్మని అతను ......నన్నే నీవు దొచుకున్నావని ఆమె ......మొత్తానికి ఒకరిని చూచి ఒకరు.....ఒళ్లుమరచి ....ఒకరి చేత ఒకరు దోచుకోబడ్డారు !
పడరు మరీ........వాళ్ల సొమ్మేం పోయిందని ........ఆ దోచుకోబడడం లో ఏమన్నా నష్టం ఉంటేగా .....ఇద్దరికీ లాభమేనాయే!అందుకే దోచుకున్నా...దోచుకోబడ్డా .....దాచుకున్నా....... వాళ్ళకే చెల్లింది !
అసలు ఈ అవస్తకు కారణం .........మనకు ఇంత కాల నష్టానికి కారణం ......మొత్తం అంతా చివరి చరణం లో వుందని ......విప్పాడు ''గుట్టు '' .... కవి మన మనసుకు తాకేట్టు ! . ఎలాగో చూడండి !
ఆమె :- కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు.....కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు.
చూసారా......చూసారా.... కవి చమత్ర్క్రుతి ? అయ్యలారా.....అమ్మాలారా ....అసలే ' ప్రేమ గుడ్డిదీ '........అంటారు . ఆపై ' కళ్ళకు గంతలు కూడా కట్టారాయే ....ఇంకా ఏం కనపడుతుంది చెప్పండి . మామూలు గానే ' కన్నె మనసు' దాగుడు మూతలు ఆడుతుంది. కళ్ళకు కట్టిన గంతల నెపం తో మరింత కాస్త ఎక్కువగా ఆడుతుంది........అని చెప్పకనే చెప్పారు .....మన ' మనసు కవి ' ఆచార్య ఆత్రేయ గారు ! అందుకే చివరకు ఇలా అంటున్నారు .......హీరో గొంతుకతో !
అతడు :- దొరికినాము చివరకు తోడుదొంగలం......దొరలమై ఏలుదాం వలపు సీమనూ ................!
కింద పడ్డా ...పై చేయి ఆంటే ఇదే ! ఈ బ్లాగు చదివిన అందరిముందు '' మనం తోడుదొంగలమై - పట్టు పడి పోయాము '' అంటూనే .....దొరలమై ప్రేమ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తామంటున్నారు . మనం అడ్డు పడ్డా ఆగుతారా ? వాళ్ల ప్రణయ సామ్రాజ్యం లో వాళ్ళని మునగనీయండి ! మళ్లీ మనం ..... ఇంకో పాటతో కలుసుకొనే దాకా ......వాళ్ళనలా వదిలేద్దాం !
సెలవా మరి! భవదీయుడు !
రమణ మూర్తి
చిత్రం ;- దాగుడు మూతలు
రచన :- ఆచార్య ఆత్రేయ
సంగీతం :- కే .వి . మహ దేవన్
పాడినది:- ఘంటసాల , సుశీల .
Thursday, April 29, 2010
Saturday, April 17, 2010
కలయా .....నిజమా .........!
కలయా ...నిజమా ...తొలి రేయి హాయి మహిమా !
అరె ఇదేంటి సార్ .....ఈ పాట ఈ మధ్యనే ఎక్కడో విన్నట్టు ఉన్నదే ......ఓహో ఇది '' కూలీ నెం .1 '' సినిమా లో పాట లా వుందే! భలే వారు సార్ ....ఏవో ' అపాతమధురాలు ....అమలిన శృంగారాలు' అని ఈ పేజి కి వస్తే మీరేమో 'టాబు-వెంకటేష్ ' ల సినిమా 'కూలి .నెం. 1 ' లో పాట ను పట్టుకుని ' కలయా- నిజమా , తోలి రేయి హాయి మహిమా.... అనుకుంటూ గొప్ప పాటల జాబితా లో చేర్చారు ....ఇదేమన్నా బాగుందా ' అంటున్నారు కదూ !
అయ్యో ...ఆగండి సార్ ....అలా తొందర పడకండి సార్ ! ఈ పాట ను ఇక్కడ చేర్చానూ ఆంటే....ఎంతో- కొంత ప్రత్యేకత వుంటుంది సార్.. పూర్తిగా చదివి ఓ అభిప్రాయానికి రండి సార్ !
****మొదటగా......ఇది ' ఇళయరాజా' తన సొంత గొంతు తో పాడిన రెండవ తెలుగు పాట !
****రెండవది.......' సుశీల ' తో కలసి పాడిన మొట్ట మొదటి పాట.
****మూడవది ...' సుశీల ' తో కలసి పాడిన చివరి పాట కూడా ఇదే !
****చివారాఖరుది......' టాబు ' ను తెలుగు తెరకు తొలి సారిగా ' హీరొయిన్ ' గా పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే !
మనం ఇంతవరకూ చర్చించు కున్నవి కేవలం మనసు పడ్డ ప్రేయసీ -ప్రియుల మధ్య జరిగిన సరస -సల్లాప కార్య క్రమాలే ! కానీ.......ఇది అలా కాదు ........ఆ దశ ను దాటి..... పరిపక్వత సాధించి ....మనసుల కలయికను మూడు ముళ్ళ బంధం గా మార్చుకుని ....ఒకరికొకరు తనువులు అర్పించుకునే .......తీయని .....సమాగపు తొలి రేయి తాలూకు ' తమకపు -గమకాలు ' !
** ఆమె : కలయా ...నిజమా....తొలి రేయి హాయి మహిమా !
*అతడు : కలయా....నిజమా....తొలి రేయి హాయి మహిమా !
** ఆమె : అలవాటు లేని సుఖమా......ఇక నిన్ను ఆప తరమా !
* అతడు : అణిగున్న ఆడతనమా .....ఇక నైన మేలుకొనుమా !
/కలయా../
నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది .....తొలి రేయి తాలూకు ......శరీర ధర్మ శాస్త్ర పరాకాష్ట ప్రకంపనల గురించి కానే కాదు. ఆ ఉద్రేక ...ఉద్విగ్న క్షణాల గురించి అంతకంటే కాదు !కేవలం మనసుకే పరిమితమైన 'మధురోహ ' గురించి . అన్ని నాళ్ల ఊహలకు రెక్కలోచ్చే వేళ ......మది పొందే ' మధు కీల ' గురించి ! సమాజ కట్టుబాట్ల కు విలువిస్తూ ....అంత కాలం తన మదిలోనే దాచుకున్న మధుర భావనలను.....తన స్త్రీత్వాన్ని .... ' తన అనుకున్న ' తన జీవిత భాగ స్వామి కి .....పాదాక్రాంతం చేసే వేళ ఆమె పొందిన అలౌకిక ఉద్విగ్న భావోద్రేక స్థితి గురించి. అలవాటు లేని సుఖాలను అలవాటు చేసుకోక తప్పదు అని ఆమె మనసు పంపే సంకేతాలను అర్ధం చేసుకోలేని అయోమయ శారీరిక స్థితి గురించి. ఆమె డోలాయమానాన్ని అర్ధం చేసుకుని ' ఆమె అణిగున్న ఆడతనాన్ని .....ఇకనుంచి అయినా కాస్త మేలుకొని ......ప్రణయ సామ్రాజ్య జగత్తును ఏలుకోమ్మనే ' అతని విజ్ఞప్తి గురించి .ఆ విజ్ఞప్తి ని పాటించిన తనువూ మనసు ' కలయా ...నిజమా ' అంటూ మళ్లీ పొందే సందేహాత్మక సుఖం గురించి ! ఇంత కంటే నేనీమి చెప్పగలనంటారు ? ఇదేదో బాగుందనుకుంటూ మనసున నెమరేసు కోవడం తప్ప !
** ఆమె : లేని పోని ఏ కూని రాగమో ...లేచిరా అంటున్నదీ ....ఆహా
* అతడు :ఊరుకొని ఏ వెర్రి కోరికో .... తీర్చవా అంటున్నదీ........
**ఆమె : కోక ముళ్ళ కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నది
* అతడు : కుర్ర కళ్ళు చీర గళ్ళలో దారే లేక వెతుకుతున్నదీ
ఆమె : ముంచే మైకమా .....మురిపించే మొహమా !
స్వేచ్చగా....మన కిష్టమైన రీతిలో .....వచన కవిత్వంలా ....పుంఖాను పుంఖాలుగా .....టన్నులు కు టన్నులు రాయడం పెద్ద గొప్ప ఏమీ కాదు ! కానీ పాట అనే చట్రంలో పరిమితులకు లోబడి అందమైన సార్వ జనీక భావాన్ని పొందికగా అమర్చడం లోనే వుంది కవి సమర్ధత అంతా ....చమక్కు అంతా ! 'క ' గుణింతం తొ 'కబాడ్డి ' ఆడుకుంటూ కవి చూపిన కొంటెతనాన్ని ....జాణతనాన్ని ( ఇది ఆడవాళ్లకే సొంతం కాదనుకుంటా ) గమనించండి !
అసలు ...... కోక ముళ్ళ కూపీ తీయాలని ......ఆ కూపీ కూడా కైపు చూపులతో తీయాలని ....ఆ చూపులు తనువును కొరుకుతాయని....ఆ కొరుకుళ్ళు ఆమె గమనిస్తుందని .....ఆ కొరుకుళ్ళు ఇంత కధ కు దారి తీసి మనను కవి తన దారిలోకి తిప్పుకుంటాడని .....ఎవరైనా ఊహిస్తారా చెప్పండి !ఇప్పటికే ఆమె ఆరోపణలకు మనం 'ఒహా.....ఓహో ' అనుకుంటుంటే ......ఆ సంభ్రమాశ్చర్యాల నుంచి మన తేరుకునే లోగానే ' కుర్ర కళ్ళు చీర గళ్ళలో దారే లేక వెదుకుతున్నవీ ' అంటూ అమాయకపు ఫోసు కొడుతూ .....ఆ అమాయకత్వాన్ని అలుసు గా చేసుకుని తనకు కావాల్సింది రాబట్టాలను కుంటున్నాడు ! హమ్మ .........ఎంత చతురుడో !
ఎలాగూ రాబట్టుకోవాలనుకున్నాడు ...........అందుకే పాచిక వేస్తున్నాడు ఇలా..............................................!
చేయి వేయనా .....సేవ చేయనా ఓ అనే వయ్యారమా !
ఏమండీ .....అతని కళ్ళకు మనం ఏమన్నా పిచ్చి వాళ్ళ లాగా కనబడుతున్నామా ఏమిటి ? లేక పొతే ఏమిటండీ .............చెయ్ వేసి ఎవరైనా సేవ చేస్తారు ఆంటే మనం నమ్ముతామటండీ ? వెనకటి కి ' మోహిని ' ఇలాగే చేయి వేస్తానని చెప్పి ' భస్మాసురుడి ' నే భస్మం చేసేసింది . ఇక్కడా అదే తంతు....అదే గేమ్ ప్లాన్ . చేయి వేస్తానుంటూ చేయి వేసి ..........నరాల నాడీ మండలాన్ని......సున్నితంగా స్పృశించి .......సమ్మోహనంగా సవరించి .....ఆమె వయ్యారాన్ని 'ఓ ' అనిపించాలనే అతని తాపత్రయం .....ఆత్రం కూడానూ !
పాల ముంచినా నీటముంచినా .....నీ దయే శ్రుంగారమా !
ఏదేదో అభ్యర్దిస్తున్నట్టుగా కనపడుతుంది పై పైకి .....కానీ అసలు అంతరార్ధం వేరు . శృంగారం లోకి దిగింతర్వాత .....ఇంకా దయ ఏముంటుంది చెప్పండి ....... ' నిండా మునిగిన వాడికి చలేమిటి ' అన్నట్టు ! బెట్టు చేయ కుండా ఒప్పుకుంటే బాగుండదు కాబట్టి....అలా వేడు కుంటున్నట్టు గునుస్తుంది.....ఎలాగూ మునక తప్పదని తెలుసు కాబట్టి....ఆ మునకలో సుఖం ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి !
అతడు :- ఆగలేని ఆకలేమిటో...పైకి పైకి దూకుతున్నది
ఆమె :- కాలు నేల నిలువకున్నది ....ఆకాశాన తేలుతున్నది
అతడు :- అంతా మాయగా .....అనిపించే కాలమూ .....**కలయా..నిజమా**
అనుమతి అంటూ ప్రత్యక్షం గానో ....పరోక్షం గానో......దొరికిన తర్వాత ఆకలేస్తే ఆబగా ఎలా తింటామో.....తనువాడే మనసాకలి కూడా వాళ్ళపై అలానే దూకుతుంది అది సహజం.....అనివార్యం కూడా ! దాని వల్ల కలిగే రమ్యమైన అనుభూతికి ఎలాగు కాళ్ళు నేలమీద నిలబడవు . ... .....శరీరం గాల్లోనే తేలుతుంది.....! ఆ సమయం లొ కలిగే కలలాంటి ....ఆ మాయానుభూతి గురించి నేను ఇంత కంటే వేరే ఏమి చెప్పగలను ! చతురులైన మీకు ......రసికులైన మీకు ......మల్లెల మత్తును పంచే మరో పాటతో ముందుకు రావడం తప్ప !
ఈ పాట సాహిత్యం ఉన్నంత గొప్పగా ....చిత్రీకరణ లేదు . అందుకే పాట తాలూకు వీడియో వుంచడం లేదు !గమనించగలరు !
భవదీయుడు
వెంకట రమణ మూర్తి !

Monday, April 5, 2010
గడుసు శృంగారం
ఆ ..శృంగారం లో ' గడుసు శృంగారం ' కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా ! ఉందండీ బాబూ..కళలలో కేవలం అరవై నాలుగు మాత్రమే ఉన్నాయి కానీ ఈ ' శృంగార కళ 'కి ఎన్ని ఉప-కళ లున్నాయో వాటిని సృష్టించిన ఆ రతీ రాజు 'మన్మధుడు' కే తెలియదు , మానవ మాత్రుడను నాకేం తెలుసు ! కాక పొతే మరేమిటి అండీ........ఉక్కు పిండం లాంటి ' భీముడిని' ముక్కు పిండి మరీ చటుక్కున అక్కున చేర్చుకుని మక్కువ తీర్చుకున్న టక్కు టమార విద్యల జక్కనా శిల్పం ' హిడింబి ' ల మధ్య సాగే సరస సల్లాప శృంగారం .. 'గడుసు శృంగారం ' కాకపొతే మరేమవుతుందండి( ఇంకా నయం ' ఇనుప శృంగారం ' అన్నారు కాదు... అని నవ్వుకోకండి ) !
మనం చర్చించుకోబోయేఈ పాటలో కవి గారు అదే పని చేసారండి . ' శ్రీ కృష్ణ పాండవీయం ' చిత్రంలో ' భీముడికి హిడింబి కి మధ్య ఓ మాంచి ' రొమాంటిక్' సాంగ్ వదిలారు . ఇక చూసుకోండి ...కోర మీసాలతో..కొర కొర చూపులతో ఉరిమి ఉరిమి ఐతే చూస్తాడు కానీ,వెనకెనుకే తిరుగుతుంటాడు ' హిడింబి 'ఆడి పాడు తుంటే ! హిడింబి ఆకర్షణ ఆది . హిడింబే కాదు....అందమైన ఏ ఆటవిక కన్నె వున్నా అదే పరిస్థితి .......పాపం భీముడిది ! ( ఇక 'జిక్కి ' గొంతు గురించి వేరే చెప్పాలా ..మత్తు మొత్తం ఒలక బోసింది )
చాంగురే బంగారు రాజా .....చాంగు చాంగు రే బంగారు రాజా
మజ్జారే మగరేడా, మత్తైన వగకాడా...అయ్యారే నీకే మనసీయాలని వుందిరా ! /చాంగు /
ఆదివాసిలలో ఆ భాష వుందో లేదో నాకు తెలియదు కానీ ఈ ' చాంగు ' ....' మజ్జారే ' అనడం ఇవన్నీ కవి కాల్పనికలే ! మనం 'హాయ్,హోయి' అన్నట్లు. ' చాంగు రే రాజా ' అంటూ పలకరించి ' బంగారు రాజా ' అంటూ ఉబ్బేసి, .'నచ్చావురా మగాడా '..' నీకు తప్ప వేరే ఎవ్వరికీ మనసివ్వలేనురా' అంటూ తిన్నగా ఎటువంటి అరమరికలు ...తిరకాసులు లేకుండా తన ఉద్దేశం ముందుంచింది !
ముచ్చటైన మొలక మీసముంది..భళా అచ్చమైన సింగపు నడుముంది. జిగీ బిగీ మేనుందీ ..సొగసులొలుకు మోముందీ , మేటి దొరవు అమ్మకు చెల్లా ...నీ సాటి ఎవ్వరున్దుట కల్లా ! /చాంగురె / గుబురు మీసాలు ఇప్పటి ఫాషను కానీ.......అప్పట్లో ఓ మోస్తరు శరీర సౌష్టవం వున్నా ఏ మగాడైనా కోరమీసం దువ్వుకుంటూ .....కనుసన్నల లోంచి ....ఓరగా చూపుల బాణం విసిరాడంటే ' నిన్ను ఇష్ట పడుతున్నానంటూ ప్రపోజల్ చేసినట్టే ! అంతటి పవర్ వుండేది ఆ కోర మీసం లో ( మొలక మీసంలో ) !
' భళా అచ్చమైన సింగపు నడుముందీ ' .....ఇక్కడ....ఇక్కడే .... అతనంటే యెంత ఇష్టమో సూటిగా చెప్పింది. వేగంగా వురకాలన్నా .......వేటాడాలన్నా ......సన్నటి బలమైన నడుము తప్పని సరి ( ఇప్పుడు బి.యమ్ . ఐ అంటారు లెండి ). అల్లాంటి నడుముంటేనే చురుకైన కదలికలుంటాయి సింహానికి.....వేటాడేటప్పుడు ! కాబట్టే సింహానితో పోల్చి మరీ వలచింది ( ' ఆరు పలకలు ' ' నాలుగు పలకలంటూ ' చీపురుపుల్ల లాంటి వాళ్ళే బడాయి పోతూ వుంటే ' మిస్టర్ . ప్రపంచ బలశాలి ' భీముడు ఇంకెంత బడాయి పోవాలి ?).
అంతేకాదు '' నేనీమీ తక్కువ కాదు నాలోనూ ' విషయం ' వుంది.....నీకు సరితూగే జిగి బిగీ వున్న శరీరం ..ముద్దులొలికే మొహం కూడా వుంది కాబట్టి నేనేమీ తీసిపోనంటూ '' కవ్వింపు తో కూడిన సవాలు విసిరింది ! విసరడమే కాదు '' అమ్మ- తోడు నా సవాలు ను స్వీకరించే దమ్మున్న మొగాడు నీవు తప్ప నిస్సందేహం గా ఎవడూ లేడు ''..అంటూ అక్కడ బల్ల వుందో లేదో నాకు తెలియదు కానీ ' కుండ మాత్రం బద్దలు గొట్టినట్టుగా ' చెప్పింది !
మెత్త బడుతున్న ' భీముడిని ' చూసి........బెట్టు జార గొట్టేలా .....పట్టు సడలవివ్వకుండానట్టు బిగిస్తుంది చూడండి !
కైపున్న మజ్జగంటి చూపూ .....ఆది చూపు కాదు పచ్చల పిడి బాకు
పచ్చల పిడిబాకు .... విచ్చిన పూరేకు ......గుచ్చుకుంటే తెలుస్తుంది రా ......మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా !
మోహావేశం లో ఉందేమో.....భీముని కొర కొర చూపు కూడా కైపు గానే కనబడుతుంది. కనబడటమే కాదు 'పచ్చల పిడి బాకు ' లా వుంది ఆంటుంది . చూసారా...చూసారా...మామూలు ' బాకు ' లా వుంది అనొచ్చుగా . మామూలు పిడి వున్న బాకు ఐతే అందులో విశేష మేముంది చెప్పండి ! సరిగా పట్టించుకోక పొతే పదును లేక మొండి కత్తిలా మిగిలి పోతుంది . అదే 'పచ్చలు తొడిగిన ' పిడివున్న బాకు ఐతే ...పదిలం గా ...శ్రద్ధ గా .ఎప్పటి కప్పుడు సాన పడుతూ,అదను చూసుకొని ..కదన రంగం లో దూకేంత, పదును ఉండేలా చూసుకొంటారు. ''అలాంటి పచ్చల పిడి బాకు లాంటి చూపుతో ...విచ్చిన ఆమె మనో పుష్పపు రేకులలో గుచ్చుకుంటే ..........అప్పటికి గానీ తెలుస్తుంది .....మనసిచ్చుకుంటే ఎలా వుంటుందో '' అని పారవశ్యం తో ఆంటుంది .
''తూచ్ ...తూచ్.. మేమొప్పుకోము...అక్కడున్న దేంటి ? మీరు రాస్తున్నదేంటి ? పచ్చల పిడి బాకు ...విచ్చిన పూరేకు ..గుచ్చుకుంటే తెలుస్తుంది రా...అని అంత స్పష్టం గా వుంటే ''...అంటున్నారా! అయ్యా మీరు ఇలా తప్పుగా అర్ధం చేసుకుంటారనే ' చిత్రీకరణ లో ఆమె ను ఇద్దరిగా చూపిస్తూ ఒకరి చేతిలో చురకత్తి ( సారీ ...పచ్చల పిడి వుందో లేదో నాకు కనబడలేదు ) మరొకరి చేతిలో విచ్చిన తామరపూవును ఉంచాడు దర్శకుడు. అయినా సరే ...మీమొప్పుకోము అంటున్నారా ! సరే మహాను భావులారా ... సమాగపు ప్రతీకలను ప్రతిబింబించేలా ..కవి అలా వాడినా ఎక్కడైనా అశ్లీల మనిపిస్తుందంటారా ? అస్సలు అనిపించదు .... 'పైగా ఎంత సొగసుగా, ఎంత గడుసుగా కవ్విస్తుంది అతడిని ' అని అనిపిస్తుంది . ఇంకా ...ఈ పడుచుదనం లో ....ఈ కోడె వయసులో .....ఆ గిలిగింతల పులకింతలు అన్నీ షరా మామూలే ' అంటుంది చూడండి !
గుబులుకొనే కోడె వయసు లెస్సా ....దాని గుబాళింపు ఇంకా హైలెస్సా !
పడుచుదనపు గిలిగింత .....గడుసు గడుసు పులకింత
ఉండనీయ నేమిసేతురా కైదండ లేక నిలువలేనురా .......చాంగురే.....!
అప్పటి దాక గుబులుకొని..గుబులుకొని..వున్న కోడె వయసు ....దాని గుబాళింపులు,గిలిగింతలు..పులకింతలు ...మనం అనుకున్నట్టు షరా మామూలు ఐతే బాగానే ఉండును .
ఆ షరా మామూలు కాస్తా ...కాలు నిలవనీయలేనంత గా ముదిరి పోయింది . అక్కడే వొచ్చి పడింది చిక్కంతా . అదుగో ..సరిగా ఆ సమయం లోనే సింగపు నడుమున్న ' భీమ బలుడు ' తగిలాడు. అందుకే అతని కైదండన బ్రతుకంతా నిశ్చింతగా గడిపేయ వొచ్చని అంతలా తాపత్రయ పడింది .
అదండీ ..ఓ బంతి లాంటి .పూబంతి సంగతి. కవి కల్పనా చాతుర్యానికి పోయింది నా మతి !
గతి తప్పిన మతి కావాలంటుంది బహుమతి ...తీరగా సరదాల కండూతి !
వీక్షించండి మరి ..పిడిబాకు -పూరేకుల సంగతి !
http://www.youtube.com/watch?v=QAPWoHJO5hE

Friday, March 19, 2010
మధురమే .........సుధాగానం !
మధురమే.....సుధాగానం !
సుధలూరించే మధురమైన గానానికి పరవశించి...... మరీ చెవి కోసుకొక పోవచ్చు గావి ......చెవిలొగ్గి విని ఆనంద పడని మనిషి ఎవరైనా వుంటారా చెప్పండి ! నేటి తరం కూడా అప్పటి' ఆపాత-మధురాలను 'యెంతగా ఇష్టపడుతున్నారో మనం చూస్తూనె వున్నాము కదా ! ప్రణయ ,విరహ ,బాంధవ్య మరియు సందేశాత్మక పాటలు వింటూ ....మనకి మనం అన్వయించుకుంటూ ....అనునయించుకుంటూ , మనల్ని మనం యెంతగా మర్చిపొతామో వేరే చెప్పాలా ! అలాంటి పాటల్ని మనం ఇక్కడ ముందు ముందు చర్చించుకుందాము !
విని యెలాగూ తరించారు.....ఇప్పుడు చదివి పులకరించండి !
భవదీయుడు
రమణమూర్తి .
************* **************** ***************** *****************
నవ రసాలలో పెద్దపీఠ వద్దన్నా ' శృంగారా నిదే ' !అంతటి మహత్తు గల' అమలిన శృంగారాన్ని' ప్రతిబింబించే ఓ మధురమైన పాట తో ఈ శీర్షికను మొదలు పెడదాం !
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు !
ఘంటశాల -సుశీలమ్మ గొంతులో పలికిన మనోహర మైన పాట అది .
సంగీతం : కె . వి . మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
చిత్రం : దాగుడు మూతలు
సంగీతం : కె . వి . మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
చిత్రం : దాగుడు మూతలు
అడగగానే ఇచ్చేస్తే అందులో మజా యేముంది ? ప్రేమిచడం కన్నా ప్రేమించబడడం గొప్ప అన్నట్లు ....అడగ కండా ఇచ్చిన మనసే ఎంతో ముద్దు ! అలాగే అందీ అందకుండా వున్న అందమే ముద్దు .అర మగ్గిన జాంపండు అన్నా....అరవిరిసిన మొగ్గ అన్నా ....ఇష్టపడని వారు ఎవరు చెప్పండి ? 'తెలిసి తెలియని మమతే ముద్దు ' . .....అవును నిజమే 'ఇది ఇదీ' అని తెలిసీతెలియని తనం లో వున్న గందరగోళం ....ఆ గందరగోళం లోనుంచి పుట్టిన ఆకర్షణ .....ఆ అకర్షణ ను అదిమి పట్టే మనసు .......మనసు చేసే యుద్ధం....... 'అబ్బో ........ఈ తెలిసీ తెలయని 'మమత ' లలో చాల 'మతలబు ' దాగివుందండీ బాబూ !
అతడు :- నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
ఆమె :- పొగిడి పొగిడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు ..
మగాడి బుద్ధి ఎప్పుడూ .....'అతిశయోక్తి కాదంటూ' .....అతివల అందాలు పొగిడి మరీ బుట్టలో పడేయాలనే అనుకుంటుంది . అందుకే 'సన్నని-పిడికెడు..నడుము' అని తి్న్నగా చెప్పకుండా......'నడకలలో నాట్యం చేస్తుందా ఆ నడుము' అంటూ గుప్పెడు ప్రశంసలు....పిడికెడు ముద్దులు కురిపించాడు.
కాని అమ్మాయి గడుసుదే.....అనుకున్నంత అమాయకురాలేమీ కాదు ! యేమి సమాధానమిచ్చిందో చూడండి. ' నన్ను బులిపించాలని ఎంత పొగిడినా .....యెన్ని చిలిపి పలుకులు పలికినా ....అవి చిటికడంతే ముద్దు ' అంటూ మొహం మీద కొట్టినట్టుగా కాకుండా కాస్త సున్నితంగానే తీసి పారేసింది .
ఇక లాభం లేదు అనుకున్నాడే మో.......పొగిడే భాగాల ను.....పొగడ్తల ఘాటు ను పెంచాడు !
యెలాగో చూడండి !
ఆతడు :- చక-చక లాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు .
''హవ్వ.....హవ్వ్వ''.....అంటూ ఆ కాలం లో ఎంతమంది ఆడవాళ్ళు ...ఎంత మంది పెద్ద వాళ్ళు బుగ్గలు నొక్కుకుని వుంటారో ? ' వీడికిదేం పొయే కాలం - అట్లా అన్నాడూ ' అంటూ తిట్టుకుని మరీ వుంటారు !
లేకపోతే యేమిటండీ ......... ' జడ పెద్దగా వుంది అనో '........' నడుము దాటి మోకాళ్ళ వెనక వరకు వుంది అనో '....'బారెడు పొడుగుతో -క్ర్రిష్ణ వేణి లా వుంది ' అనో .......అనొచ్చు కదండీ ! ఊహు .......ఎలా అన్నా ఫలితం వుండదనుకున్నాడేమో ......తిన్నగా ' పిరుదుల ' దగ్గరెకే వెళ్ళి పోయాడు. సరే వెళ్ళాడే అనుకోండి . 'నడుమూ....జఘనమూ దాటి వేళ్ళాడే అంత పొడుగ్గా వుంది...నీ జడ ' అనొచ్చుగా ! ఊహూ .....అలా కూడా అనలేదు ! యేకంగా .....' చక -చక లాడే................దాటే ' అంటూ ఆమె జఘన సంపద యెంత గొప్పగా వుందో .....చెప్పకనే చెప్పాడు ......చూపుల్తో తడిమి మరీ !
ఇక్కడ కవి ' ఊరువుల ' గురించి అంతలా ఊసెత్తినా .......ముసి నవ్వుల సిగ్గు కాస్త మోమున దోబూచు లాడుతుందే తప్ప ......' చీ ' అనిపించదు . అల్లన ఓ పిల్లగాలి మనసును తాకి వెళ్ళినట్టు వుంటుందే తప్ప అసభ్యమనిపించదు . అదీ అమలిన శృంగారమంటీ !
కానీ తను అంతలా మోహపు పరవశపు మాటలు ఆడినా........మత్తులో తోయాలనుకున్నా ఆమె లొంగిపోలేదు .....పొగడ్తలకు పడి పోలేదు సరి కదా ....... ' నే కోరుకున్నది నీ ప్రేమతో పాటు ....నీ అండ....నీ రక్ష ' ....అంటూ ఏముంటుందో చూడండి !
ఆమె :- కల కాలం తల దాచుకొమ్మనే యెడదను చూస్తే ఎంతో ముద్దు .
విశాలమైన నీ చాతి.....అందులోని విశాల హృదయం ..చూస్తే యెంతో ముద్దు .....అంటూ తన 'security' ని కూడా కోరుకుంది.
ఇక కవి హృదయం .....వాళ్ళ కల్యాణం తో పాటు ....లోక కల్యాణం కూడా కోరింది ! అదెలాగో గమనించండి .
'పచ్చని చేలే కంటికి ముద్దు...నెచ్చెలి నవ్వే జంటకు ముద్దు ' ...అంటూ చెలి నవ్వును జంటకు ఆపాదించడమే కాకుండా ....ఆ నవ్వును 'పచ్చని చేల పచ్చదనం కలిగించే హాయి' తో సమానమంటూ పోల్చాడు. అంతే కాదు ....చెట్టు -చేమా యెలాగైతే ఈ లోకానికి ముద్దో .....మన ఇద్దరం కూడా ఈ జగతికి అంతే ముద్దు అంటూ ముగించాడు !
ఏంత గొప్ప భావనో కదండీ ! 'స్వచ్హమైన ప్రేమ- జంట ల ముద్దులాట ......పచ్హదనాల పైరు- పంట ' జగతికి ఎంత కల్యాణ దాయకమో ! ఇంతగా మనసును తాకేలా......మనల్ని యెక్కడకో తీసుకెళ్ళేలా...... రాసిన ఇలాంటి పాటలను మళ్ళి మళ్ళి వినాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి !
మళ్లీ ఓ మంచి పాట తో కలుద్దాం ( చాంగురే బంగారు రాజా )
మీ అభిప్రాయాలను రాస్తారు కదూ *************!
Subscribe to:
Posts (Atom)