మధురమే.....సుధాగానం !
సుధలూరించే మధురమైన గానానికి పరవశించి...... మరీ చెవి కోసుకొక పోవచ్చు గావి ......చెవిలొగ్గి విని ఆనంద పడని మనిషి ఎవరైనా వుంటారా చెప్పండి ! నేటి తరం కూడా అప్పటి' ఆపాత-మధురాలను 'యెంతగా ఇష్టపడుతున్నారో మనం చూస్తూనె వున్నాము కదా ! ప్రణయ ,విరహ ,బాంధవ్య మరియు సందేశాత్మక పాటలు వింటూ ....మనకి మనం అన్వయించుకుంటూ ....అనునయించుకుంటూ , మనల్ని మనం యెంతగా మర్చిపొతామో వేరే చెప్పాలా ! అలాంటి పాటల్ని మనం ఇక్కడ ముందు ముందు చర్చించుకుందాము !
విని యెలాగూ తరించారు.....ఇప్పుడు చదివి పులకరించండి !
భవదీయుడు
రమణమూర్తి .
************* **************** ***************** *****************
నవ రసాలలో పెద్దపీఠ వద్దన్నా ' శృంగారా నిదే ' !అంతటి మహత్తు గల' అమలిన శృంగారాన్ని' ప్రతిబింబించే ఓ మధురమైన పాట తో ఈ శీర్షికను మొదలు పెడదాం !
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు !
ఘంటశాల -సుశీలమ్మ గొంతులో పలికిన మనోహర మైన పాట అది .
సంగీతం : కె . వి . మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
చిత్రం : దాగుడు మూతలు
సంగీతం : కె . వి . మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
చిత్రం : దాగుడు మూతలు
అడగగానే ఇచ్చేస్తే అందులో మజా యేముంది ? ప్రేమిచడం కన్నా ప్రేమించబడడం గొప్ప అన్నట్లు ....అడగ కండా ఇచ్చిన మనసే ఎంతో ముద్దు ! అలాగే అందీ అందకుండా వున్న అందమే ముద్దు .అర మగ్గిన జాంపండు అన్నా....అరవిరిసిన మొగ్గ అన్నా ....ఇష్టపడని వారు ఎవరు చెప్పండి ? 'తెలిసి తెలియని మమతే ముద్దు ' . .....అవును నిజమే 'ఇది ఇదీ' అని తెలిసీతెలియని తనం లో వున్న గందరగోళం ....ఆ గందరగోళం లోనుంచి పుట్టిన ఆకర్షణ .....ఆ అకర్షణ ను అదిమి పట్టే మనసు .......మనసు చేసే యుద్ధం....... 'అబ్బో ........ఈ తెలిసీ తెలయని 'మమత ' లలో చాల 'మతలబు ' దాగివుందండీ బాబూ !
అతడు :- నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
ఆమె :- పొగిడి పొగిడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు ..
మగాడి బుద్ధి ఎప్పుడూ .....'అతిశయోక్తి కాదంటూ' .....అతివల అందాలు పొగిడి మరీ బుట్టలో పడేయాలనే అనుకుంటుంది . అందుకే 'సన్నని-పిడికెడు..నడుము' అని తి్న్నగా చెప్పకుండా......'నడకలలో నాట్యం చేస్తుందా ఆ నడుము' అంటూ గుప్పెడు ప్రశంసలు....పిడికెడు ముద్దులు కురిపించాడు.
కాని అమ్మాయి గడుసుదే.....అనుకున్నంత అమాయకురాలేమీ కాదు ! యేమి సమాధానమిచ్చిందో చూడండి. ' నన్ను బులిపించాలని ఎంత పొగిడినా .....యెన్ని చిలిపి పలుకులు పలికినా ....అవి చిటికడంతే ముద్దు ' అంటూ మొహం మీద కొట్టినట్టుగా కాకుండా కాస్త సున్నితంగానే తీసి పారేసింది .
ఇక లాభం లేదు అనుకున్నాడే మో.......పొగిడే భాగాల ను.....పొగడ్తల ఘాటు ను పెంచాడు !
యెలాగో చూడండి !
ఆతడు :- చక-చక లాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు .
''హవ్వ.....హవ్వ్వ''.....అంటూ ఆ కాలం లో ఎంతమంది ఆడవాళ్ళు ...ఎంత మంది పెద్ద వాళ్ళు బుగ్గలు నొక్కుకుని వుంటారో ? ' వీడికిదేం పొయే కాలం - అట్లా అన్నాడూ ' అంటూ తిట్టుకుని మరీ వుంటారు !
లేకపోతే యేమిటండీ ......... ' జడ పెద్దగా వుంది అనో '........' నడుము దాటి మోకాళ్ళ వెనక వరకు వుంది అనో '....'బారెడు పొడుగుతో -క్ర్రిష్ణ వేణి లా వుంది ' అనో .......అనొచ్చు కదండీ ! ఊహు .......ఎలా అన్నా ఫలితం వుండదనుకున్నాడేమో ......తిన్నగా ' పిరుదుల ' దగ్గరెకే వెళ్ళి పోయాడు. సరే వెళ్ళాడే అనుకోండి . 'నడుమూ....జఘనమూ దాటి వేళ్ళాడే అంత పొడుగ్గా వుంది...నీ జడ ' అనొచ్చుగా ! ఊహూ .....అలా కూడా అనలేదు ! యేకంగా .....' చక -చక లాడే................దాటే ' అంటూ ఆమె జఘన సంపద యెంత గొప్పగా వుందో .....చెప్పకనే చెప్పాడు ......చూపుల్తో తడిమి మరీ !
ఇక్కడ కవి ' ఊరువుల ' గురించి అంతలా ఊసెత్తినా .......ముసి నవ్వుల సిగ్గు కాస్త మోమున దోబూచు లాడుతుందే తప్ప ......' చీ ' అనిపించదు . అల్లన ఓ పిల్లగాలి మనసును తాకి వెళ్ళినట్టు వుంటుందే తప్ప అసభ్యమనిపించదు . అదీ అమలిన శృంగారమంటీ !
కానీ తను అంతలా మోహపు పరవశపు మాటలు ఆడినా........మత్తులో తోయాలనుకున్నా ఆమె లొంగిపోలేదు .....పొగడ్తలకు పడి పోలేదు సరి కదా ....... ' నే కోరుకున్నది నీ ప్రేమతో పాటు ....నీ అండ....నీ రక్ష ' ....అంటూ ఏముంటుందో చూడండి !
ఆమె :- కల కాలం తల దాచుకొమ్మనే యెడదను చూస్తే ఎంతో ముద్దు .
విశాలమైన నీ చాతి.....అందులోని విశాల హృదయం ..చూస్తే యెంతో ముద్దు .....అంటూ తన 'security' ని కూడా కోరుకుంది.
ఇక కవి హృదయం .....వాళ్ళ కల్యాణం తో పాటు ....లోక కల్యాణం కూడా కోరింది ! అదెలాగో గమనించండి .
'పచ్చని చేలే కంటికి ముద్దు...నెచ్చెలి నవ్వే జంటకు ముద్దు ' ...అంటూ చెలి నవ్వును జంటకు ఆపాదించడమే కాకుండా ....ఆ నవ్వును 'పచ్చని చేల పచ్చదనం కలిగించే హాయి' తో సమానమంటూ పోల్చాడు. అంతే కాదు ....చెట్టు -చేమా యెలాగైతే ఈ లోకానికి ముద్దో .....మన ఇద్దరం కూడా ఈ జగతికి అంతే ముద్దు అంటూ ముగించాడు !
ఏంత గొప్ప భావనో కదండీ ! 'స్వచ్హమైన ప్రేమ- జంట ల ముద్దులాట ......పచ్హదనాల పైరు- పంట ' జగతికి ఎంత కల్యాణ దాయకమో ! ఇంతగా మనసును తాకేలా......మనల్ని యెక్కడకో తీసుకెళ్ళేలా...... రాసిన ఇలాంటి పాటలను మళ్ళి మళ్ళి వినాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి !
మళ్లీ ఓ మంచి పాట తో కలుద్దాం ( చాంగురే బంగారు రాజా )
మీ అభిప్రాయాలను రాస్తారు కదూ *************!
baagundi.ee paata aadhaaram chesukuni ' o sarasa maina kadha ' raasi ' swaati -weekly ' ki pampandi !
ReplyDeleteచాల బాగా వ్రాసినావు రమణ మూర్తి. పాటలలో దాగివున్న కవి హృదయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినావు. అలనాటి పాత పాటలలో సాహిత్యము మదిలో వలపు తలపులను విహంగముల విను న\వీధిలో విహరింప చేస్తాయి అంటే అది అతిశయోక్తి కాజాలదు.
ReplyDeleteసెలవు
భవదీయుడు
ప్రదీప్ నామధేయుడు.
murthy garu, meeru nijamga cheppandi meeku Dr. degree denilovachindo....., simply superb, ee patalo intha ardam vundi ani nenu assalu expect cheyaledu.
ReplyDeletemee nundi ilantivi marreno ravali ani, memu thelusukovali ani entho assatho eduruchustamu...
rasaaswadana chese manasu vundadam mee goppadanam . mee protsaham to marinni ppatalu raayadaaniki prayatnistaa !
ReplyDeletesurekhacartoons.blogspot.com
ReplyDeleteడాక్టర్ రమణ మూర్తి గారు, శుభోదయం! పాత పాటలు అంటె ఇష్టపడని
వాళ్ళెవరు.అద్భుతంగా వుంది మీ బ్లాగు.నేను ఇప్పటికి నా పాత గ్రామ
ఫోన్ మీద, రికార్డ్ ప్లేయర్ మీద 78 ఆర్పియం, యల్.పీ రికార్డులు
వింటుంటాను.అ
ధన్యవాదములు.మీ అభిమానాన్ని ( నా మీద ...పాత పాటల మీద) ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
ReplyDeleteDear Dr.Ramana Murty gaaru,
ReplyDeletewill you pl.give me your email address.
cartoonsurekha@gmail.com
Surekha
Hello sir! good discription.....waiting for nextone.@phani
ReplyDeletenenu modatisari mee blog ni choosthunna......
ReplyDeleteila telugu patha paatala madhurimalani ardham chesukogaligenu idivaralo, kaani merentho chakkaga vatini andaritho panchukuntunna vainam chala bagundi mastaru........ chala chakkaga varnisthu kavula hrudayalni maa kalla mundu niluputhunnaru. dhanyavaadalu andii..
లక్ష్మి గార్కి !
ReplyDeleteవేవేల క్షమాపణలు .కొన్ని వ్యక్థిగత కారణాల వల్ల కొంతకాలం అంతర్జాలానికి దూరంగా వున్నా ! అందుకే మీ వ్యాఖ్యను చూడలేదు.
ధన్యవాదములు !